ఇకపై షూటింగ్‌లు చేయను: ఆర్కే రోజా

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రులు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. నగరి ఎమ్మెల్యే రోజాకు నూతన కేబినేట్‌లో చోటు దక్కింది. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. సిఎం జగన్ ఇచ్చిన గుర్తింపు మర్చిపోనని అన్నారు. జగనన్న రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఇపుడు మంత్రిగా అవకాశమిచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి అయినందుకు షూటింగ్‌లు మానేస్తున్నాను. టివి, సినిమా షూటింగ్‌లు చేయను, జబర్ధస్త్ షోలో పాల్గొనను అని ప్రకటించారు.