వికారాబాద్ జిల్లా కొడంగ‌ల్‌లో రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

కొడంగ‌ల్ (CLiC2NEWS): క‌ర్ణాట‌క‌లోని గ‌నుగాపూర్‌లోని ద‌త్తాత్రేయ స్వామి ద‌ర్శానికి వెళ్లి తిరిగి వ‌స్తుండగా రోడ్డు ప్ర‌మాదానికి గురై హైద‌రాబాద్ వాసులు మృతి చెందారు. కొడంగ‌ల్‌లోని ఐన‌న్ ప‌ల్లి వ‌ద్ద రెండు కార్లు ఢీకొని ముగ్గురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌ర‌ణించిన వారు న‌గ‌రంలోని కూక‌ట్‌ప‌ల్లి ప్రాంతానికి చెందినవారు. చిట్ల‌ప‌ల్లి-యాల‌మ‌ద్ది గ్రామాల మ‌ధ్య జాతీయ రహ‌దారిపై బొలెరో వాహ‌నం వీరు ప్ర‌యాణిస్తున్న కారును బ‌లంగా ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. మృత‌దేహాల‌ను కొడంగ‌ల్ ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు.

Leave A Reply

Your email address will not be published.