RRR: `దోస్తీ` సాంగ్ వచ్చేసింది
రాజమౌళి అంటేనే సెన్సేషన్.. ఈ దర్శకధీరుడి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాన్-ఇండియా ప్రాజెక్టు గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ భారీ సినిమా నుంచి ‘దోస్తీ’ సాంగ్ వచ్చేసింది. ఇవాళ (ఆదివారం) ఉదయం విడుదలైన ఈ పాట అందరినీ ఆకట్టుకొనేలా ఉంది.
కీరవాణి సారథ్యంలో హేమచంద్ర (తెలుగు), అమిత్ త్రివేది (హిందీ), అనిరుధ్ (తమిళం), యాజిన్ నిజార్ (కన్నడ), విజయ్ జేసుదాస్ (మలయాళం).. ఇలా ఐదు భాషలకు చెందిన ఐదుగురు సంగీత యువ కెరటాలు ఈ పాటను హుషారెత్తించేలా ఆలపించారు.
“పులికి వీలుగాడికి..
తలకి ఉరితాడుకి..
కదిలే కార్చిచ్చుకి..
కసిరే బడగళ్లకి..
రవికి మేఘానికీ….
‘దోస్తీ’ ఊహించని చిత్రమే చిత్రం..
స్నేహానికి చాచిన హస్తం..
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో.. ’
అంటూ సాగే ఈ పాట అభిమానులను విపరీతంగా అలరిస్తోంది.
రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురంభీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఆలియాభట్, ఒలీవియా మోరీస్, రేయ్ స్టీవ్‌సన్, ఆలిసన్ డ్యూడీ, శ్రియ, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖనిలతోపాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.