అధిక ధరకు సినిమా టికెట్ విక్రయం.. థియేటర్‌కు రూ.12వేలు జరిమానా..

చెన్నై (CLiC2NEWS): ప్రభుత్వం నిర్ణయించన ధర కన్నా ఎక్కువ ధరకు సినిమా టికెట్ విక్రయించినందుకు ఓ థియేటర్‌కు రూ. 12వేల జరిమానా పడింది. 2021 నవంబర్ 4న రజనీకాంత్ మూవి అన్నాత్తే విడుదలైంది. చెన్నైలోని ఓ థియేటర్ ఓ వ్యక్తికి ఆన్‌లైన్ వేదిక ద్వారా రూ. 159.50లకు టికెట్ విక్రయించింది. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువ ధర వసూలు చేయడాన్ని గుర్తించిన ఆ వ్యక్తి దాన్ని సవాల్ చేస్తూ కన్జ్యూమర్ గ్రీవెన్స్ కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరకు టికెట్ విక్రయించినందుకు 2021 నాటి ధరకు 75 రెట్లు నష్ట పరిహారం బాధితుడికి చెల్లించాలని కన్జ్యూమర్ గ్రీవెన్స్ కమిషనర్ ఆదేశించారు.