రూ. 1,526 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత..

ఢిల్లీ (CLiC2NEWS): డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ డిఆర్ ఐ భారత తీర రక్షక దళం ఐసిజి అధికారులు భారీ స్థాయిలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నరు. లక్షద్వీప్ తీరంలోని పడవల్లో తరలిస్తున్న 218 కిలోల హెరాయిన్‌ను పట్టుకున్నారు. ఆపరేషన్ ఖొజ్బీన్ పేరుతో అగట్టి తీరంలో డిఆర్ ఐ, ఐసిజి అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడులలో సుమారు రూ. 1,526 కోట్ల విలువ చేసే 218 పాకెట్లడ్రగ్స్‌ను పట్టుకున్నారు.
గల రెండు నెలల వ్యవధిలో దేశంలో భారీ స్థాయిలో మాదకద్రవ్యాలు పట్టుబడటం ఇది నాలుగోసారి అని అధికారులు తెలిపారు. ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు 3800 కిలోలకు పైగా హెరాయిన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి విలువ మొత్తంగా దాదాపు రూ. 26,000 కోట్లు ఉంటుందని అంచనా