జ‌న‌గామలో రూ. 2 కోట్లు విలువ‌చేసే గంజాయి ప‌ట్టివేత‌..

జ‌న‌గామ‌ (CLiC2NEWS): జ‌న‌గామ‌లో డిసిఎం వ్యానులో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న గంజాయిని పోలీసులు ప‌ట్టుకున్నారు. ఆంధ్ర‌-ఒడిశా స‌రిహ‌ద్దు నుండి త‌ర‌లిస్తున్న గంజాయిని టాస్క్‌ఫోర్స్, లింగాల ఘ‌న్‌పూర్ పోలీస‌లు సంయుక్తంగా దాడులు నిర్వ‌హించి ప‌ట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ. 2.36కోట్లు ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు. నిందుతుల‌ను ప్ర‌భాక‌ర్‌రెడ్డి, న‌టేక‌ర్ మ‌హేశ్‌గా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుండి 1577 కిలోల గంజాయితో పాటు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.