కోర్టు ప్రాంగణంలో దూషణకు పాల్పడ్డ వ్యక్తికి రూ. 3వేల జరిమానా
Ramagundam Police Commiissionerate

మంచిర్యాల్ (CLiC2NEWS): 2017 సెప్టెంబర్‌లో కోర్టు ప్రాంగణంలో దూషణకు ప్రాల్పడ్డ వ్యక్తికి నేడు మూడు వేల రూపాయల జరిమాన విధించింది న్యాయస్థానం . ఓ కేసు విషయంలో కోర్టుకు హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో ఫిర్యాదు దారుడిని మంచిర్యాల గౌతమ్ నగర్‌కు చెందిన బిల్లా మల్లయ్య కులం పేరుతో దూషించాడు. రాజేష్ నాయక్ సెకండ్ అడిషనల్ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశాడు. ఆయన ఆదేశాల మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశాడు. అనంతరం ఛార్జి షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితుడికి బుధవారం ఆదిలాబాద్ కోర్టులో స్పెషల్ ఎస్ సి, ఎస్టి అదనపు న్యాయమూర్తి, జిల్లా మరియు సెషన్స్ జడ్డి తీర్పునిచ్చారు.
నిందితులపై కేసు నమోదు చేసి పకడ్బందీగా విచారణ చేపట్టి 9 మంది సాక్షులతో చార్జి సీటు నమోదు చేసిన ఎసిపిలు సిహెచ్ చిన్నయ్య, మహమ్మద్ గౌస్ బాబా, ఎస్సై ఆకుల అశోక్,లను.. న్యాయస్థానంలో సాక్షుల విచారణ సందర్భంగా సహకరించిన మంచిర్యాల్ జిల్లా డిసిపి సుధీర్ కేకన్, ఏసిపి తిరుపతిరెడ్డి, మంచిర్యాల్ ఇన్స్పెక్టర్ ముస్కే రాజు, ప్రత్యేక పిపి ఈ. కిరణ్ కుమార్ రెడ్డి, లైజన్ అధికారి సయ్యద్ తాజాద్దీన్ లను రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ప్రాసిక్యూషన్ బృందానికి అభినందనలు తెలియజేశారు.