కెసిఆర్‌తో భేటీ అయిన ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్..

హైదరాబాద్ (CLiC2NEWS): బిఆర్ ఎస్ అధినేత కెసిఆర్‌తో బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సమావేశమయ్యారు. నగరంలోని నందినగర్‌లోని కెసిఆర్ నివాసంలో వీరిద్దరూ భేటీఅయినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిఆర్ ఎస్ విధానాలను ప్రవీణ్‌కుమార్ తీవ్రస్థాయిలో వ్యతిరేఖించారు. తాజా వీరిరువురి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా రాజకీయ పరిస్థితులు, పలు ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం.