హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

రంగారెడ్డి (CLiC2NEWS): జిల్లాలోని ఆమనగల్లు మండలం రామ్‌నుంతల శివారులో హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై అర్‌టిసి బస్సు, కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను జెసిబితో వెలికితీశారు. మరణించిన వారు హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్కు చెందిన శివకృష్ణ వరప్రసాద్, మేఘావత్ నిఖిల్, బుర్ర మణిదీప్‌గా గుర్తించారు. వీరంతా కల్వకుర్తి నుండి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదానిక గురయ్యారు.