నంద్యాల జిల్లాలోని పాలేరు వాగులో చిక్కుకున్న బస్సు

నంద్యాల (CLiC2NEWS): తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ ప్రవాహాల వలన వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. తాజాగా నంద్యాల జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సంజామల వద్ద పాలేరు వాగు పొంగి ప్రవహిస్తుంది. కోయిలగుంట్ల డిపోకు చెందిన ఆర్‌టిసి బస్సు వరద నీటిలో చిక్కుకుంది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికులను సురక్షితంగా దింపేశాడు.