AP: మన్యదర్శిని పేరుతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
![](https://clic2news.com/wp-content/uploads/2022/02/APSRTC.jpg)
ఏలూరు (CLiC2NEWS): శీతాకాలంలో ‘మన్యదర్శిని’ పేరుతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ డిపిటిఒ వరప్రసాద్ తెలిపారు. ఈ బస్సులను శని, ఆదివారాల్లో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు నుండి కోరుకొండ లక్ష్మీ నరషింహస్వామి, గోకవరం బాపనమ్మ గుడి, రంపచోడవరం, మారేడు మిల్లిలోని ప్రకృతి రమణీయ ప్రదేశాల సందర్శన తర్వాత తిరిగి బయలు దేరిన స్థానాలకు చేరతాయి. ఈ యాత్రకు ఏలూరు నుండి టికె్ట్ ధర రూ. 750, జంగారెడ్డిగూడెం నుండి రూ. 650, నూజివీడు నుండి రూ. 1000 గా నిర్ణయించారు.
అదేవిధంగా ధనుర్మాసంలో మూడు విశిష్ట క్షేత్రాల దర్శనకు కూడా ప్రత్యేక బస్సులు ఆర్టీసీ నడపనుంది. భద్రాచలం, ద్వారకాతిరుమల, అన్నవరం పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ బస్సులు శుక్రవారం రాత్రి 10 గంటలకు బయలుదేరతాయి. ఈ బస్సుల టికె్ట్ ధర రూ. 1300 గా నిర్ణయించినట్లు తెలిపారు.