Russia నుంచి భారత్‌కు 2 విమానాల్లో వైద్య సామాగ్రి

న్యూఢిల్లీ (CLiC2NEWS): భారత్‌లో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతితో వణికిపోతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఆసుపత్రులలో కరోనా రోగుల తాకిడి పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌తోపాటు, ఇతర వైద్య సదుపాయాలు సరిపడటం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచలోని పలు దేశాలు భారత్‌కు అండగా నిలుస్తున్నాయి. సహాయ సహకారాలు అందించేందుకు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ భారీ సాయం అందించేదుకు మిత్ర దేశం రష్యా ముందుకొచ్చింది. తాజాగా రష్యా కూడా భారత్‌కు భారీగా వైద్యసామాగ్రిని పంపింది. రష్యా నుంచి 20 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, 75 వెంటిలేటర్లు, 150 బెడ్‌సైడ్ మానిటర్లు, 22 మెట్రిక్ టన్నుల ఔషధాలతో బుధవారం బయలుదేరిన రెండు విమానాలు ఈ తెల్లవారుజామున ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాయి. విమానాల నుంచి వైద్య సామాగ్రిని అన్‌లోడ్ చేయించిన అధికారులు అవసరమున్న వివిధ ఆస్పత్రులకు దాన్ని చేరేవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.