క్వారీ జాతర ను ప్రశాంతంగా జరుపుకోవాలి: మంచిర్యాల సిఐ నారాయణ

మంచిర్యాల(CLiC2NEWS): పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచిర్యాల ఏసీసీ క్వారీలో రేపు (ఆదివారం) జరగనున్న క్వారీ (దుర్గాదేవి) జాతరను ప్రశాంతంగా జరుపుకోవాలని సిఐ. నారాయణ నాయక్ ప్రజలను కోరారు. ఆదివారం జాతర జరిగే ప్రాంతానికి వెళ్లే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. జాతరకు మంచిర్యాల పరిసరా ప్రాంతాలతో సింగరేణి కోల్‌బెల్టు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన‌నున్నారు. అదేవిధంగా కొమురంభీం జిల్లా, గోదావరిఖని, బెల్లంపల్లి ప్రాంతాలే కాకుండా మహారాష్ట్ర ప్రాంతం నుండి విశేష సంఖ్యలో భక్తులు వస్తారు. గత కొద్దీ రోజులు గా వర్షాలు పడడం వలన రహదారులు చెడిపోవడం జరిగింది కావున హెవీ వెహికల్ లతో వస్తే వాహనాలు ఇరుక్కొని పోవడం, లేదా ఏదైనా సమస్య వచ్చి ఆగిపోయినట్లయితే ట్రాఫిక్ సమస్య అవుతుంద‌ని సిఐ తెలిపారు. దాంతో జాత‌ర‌కు వచ్చే భక్తులు ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబ‌ట్టి హెవీ వెహికల్ కి అనుమతి లేదని పేర్కొన్నారు. జాతరలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ సిబ్బంది మఫ్టీలో నిఘాలో వుంటారని అని తెలిపారు. భక్తులు ఓపికతో దుర్గాదేవి అమ్మ వారిని దర్శించుకుని ఇంటికి వెళ్లాలని సూచించారు. జాతరకి వచ్చే భక్తులు పోలీసు వారికి సహకరించాలని కోరారు. రామగుండం సీపీ ఆదేశాలు మేరకు మంచిర్యాల డీసీపీ, ఏసీపీ పర్యవేక్షణ లో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సీఐ నారాయణ ఒక ప్రకటన లో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.