శరీరానికి తక్షణ శక్తినిచ్చే సగ్గుబియ్యం..

సగ్గుబియ్యం.. వీటిని సాబుదానా అని కూడా అంటారు. ఎండాకాలంలో వడదెబ్బకు గురికాకుండా సగ్గుబియ్యం జావ ఉపయోగపడుతుంది. వీటిని జావ రూపంలో గాని.. పాయసం రూపంలో గాని తీసుకోవచ్చు.
వీటిలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలు, మలబద్దకంని తగ్గిస్తాయి.
సగ్గుబియ్యాన్ని ఐరన్‌కి పవర్‌హౌస్‌లా భావిస్తారు. రక్త హీనత సమస్యతో బాధపడుతున్నవారు వీటిని ఆహారంలో చేర్చుకోవడంతో ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
వీటిలో కార్బుహైడ్రేట్స్ ఉండటం వలన ఎనర్జి బూస్టర్‌గా పనిచేస్తాయి. తక్షణ శక్తినిస్తాయి.
కడుపునొప్పి, డయేరియా, నీరసం, నిస్సత్తువ.. వంటివి ఇబ్బంది పెడుతున్నపుడు సగ్గుబియ్యం జావ తక్షణ శక్తి నిచ్చి మంచి ఔషధంలా పనిచేస్తుంది.
వీటిలో ప్రొటీన్లు, విటమిన్‌సి, కాల్షియంతో పాటు ఇతర ఖనిజాలు అధికంగా ఉంటాయి. దీంతో కండరాలు, ఎముకలు బలంగా తయారవుతాయి. సగ్గు బియ్యం కండరాలు బలపడటానికి ఉపయోగపడుతుంది.
వ్యాయామం చేసిన తరువాత గాని.. ఏదైనా వ్యాధి బారిన పడ్డవారు సగ్గు బియ్యంతో చేసిన జావ తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. సగ్గుబియ్యం నీటిని ఎక్కువగా గ్రహిస్తుంది. శరీరం డీహైడ్రేట్ బారిన పడకుండా కాపాడుతుంది.
సగ్గుబియ్యంలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బితో పాటు ట్రిప్టోఫాన్, అమైనో ఆమ్లాలు, ఐరన్ కాల్షియం, విటమిన్ కె వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా నరాల వ్యవస్థ బాగా పనిచేస్తుంది. యాంగ్జైటి, నిద్రలేమి సమస్యలు తగ్గుముఖం పడతాయి.