పెదపారుపూడిలో పలు నూతన నిర్మాణాలను ప్రారంభించిన శైలజా కిరణ్

అమరావతి (CLiC2NEWS): రామోజి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెదపారుపూడి గ్రామంలో నిర్మించిన ప్రాథమిక పాఠశాల, వ్యవసాయ సహకార సంఘం, పశువైద్యశాల భవనాలను శైలజా కిరణ్ ప్రారంభించారు. 2015లో రామోజి గ్రూప్ ఛైర్మన్ రామోజి రావు స్వస్థలం కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అప్పటి నుండి గ్రామంలో రూ.89 కోట్ల వ్యయంతో పలు అభివృద్ది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎండి శైలజా కిరణ్ తెలిపారు. మాతృభూమి, మాతృభాష అన్నా రామోజి రావుకు అమితమైన ప్రేమని.. ఆయన పుట్టిన ఊరి రుణం తీర్చుకునేందుకు తమకు అవకాశం కల్పించినందుకు ఆగ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.