TS: 11న గురుకుల సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష

హైదరాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోని రుక్మాపూర్‌ (కరీంనగర్‌), అశోక్‌నగర్‌ (నర్సంపేట్‌) సైనిక విద్యాలయాల్లో ఆరోతరగతి, ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం ఈ నెల 11న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

https://tswreis.in, https://www.tgtwgurukulam.telangana.gov.in/ వెబ్‌సైట్‌ల నుంచి విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆయా సొసైటీలు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. కోవిడ్‌–19 నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందే హాజరు కావాలని తెలిపాయి.

Leave A Reply

Your email address will not be published.