సినీ ఫక్కీలో శ్రీ‌గంధం చెక్క‌ల అక్ర‌మ ర‌వ‌ణా..

చేవెళ్ల (CLiC2NEWS): సినీ ఫ‌క్కీలో అక్ర‌మంగా శ్రీగంధం చెక్క‌ల‌ను త‌ర‌లిస్తున్న ముఠాను పోలీసులు ప‌ట్టుకున్నారు. పుష్ప సినిమా త‌ర‌హాలో డిసిఎంలో గంధం చెక్క‌ల‌ను దాచి మ‌హారాష్ట్ర నుండి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండ‌లం నాగ‌ర్‌గూడ‌లోని ఓ పెర్‌ప్యూమ్ ఫ్యాక్ట‌రీకి త‌ర‌లిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. చేవెళ్ల మండ‌లంలోని బ‌స్తేపూర్ శివారులో పోలీసులు సోదాలు నిర్వ‌హించి వెయ్యి కిలోల శ్రీ‌గంధం చెక్క‌ల‌ను త‌ర‌లిస్తున్న ముగ్గురు వ్య‌క్తుల‌ను అరెస్టు చేశారు. వీటి విలువ రూ.30ల‌క్ష‌లు ఉంటుంది. పెర్‌ప్యూమ్ ఫ్యాక్ట‌రీ య‌జ‌మాని అబ్దుల్ కుర్వి, మేనేజ‌ర్ సిద్ధిఖ్ ప‌రారీలో ఉన్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.