సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. చికిత్స పొందుతున్న శ్రీతేజ్ డిశ్చార్జ్..

హైదరాబాద్ (CLiC2NEWS): పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షో సందర్భంగా నగరంలోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కోలుకుంటున్నాడు. శ్రీతేజ్‌ను ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో వైద్యులు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. బాలుడికి నాలుగు నెలల 25 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స కొనసాగింది. ప్రస్తుతం శ్రీతేజ్‌ను రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించాలని వైద్యులు సూచించారు. అక్కడ 15 రోజుల పాటు బాలుడికి ఫిజియోథెరపి వంటివి నిర్వహిస్తారు. అనంతరం ఇంటికి తీసుకువెళ్లొచ్చని వైద్యులు సూచించినట్లు సమాచారం.