జపాన్ కు ఎన్నికైన తొలి మ‌హిళా ప్ర‌ధాని స‌నే త‌కైచి

టోక్యో (CLiC2NEWS): స‌ర్యూడు ఉదయించే దేశం జ‌పాన్ కు తొలి ప్ర‌ధానిగా అతివాద నేత స‌నే త‌కైచి ఎన్నిక‌య్యారు. మంగ‌ళ‌వారం నాడు జపాన్ పార్ల‌మెంట్ స‌నే త‌కైచిని ప్ర‌ధానిగా ఎన్నుకుంది. దీంతో తొలి మ‌హిళా ప్ర‌ధానిగా స‌నే త‌కైచి చ‌రిత్ర సృష్టించింది.

అంత‌ర్గ‌త విబేధాల‌తో జ‌పాన్ ప్ర‌ధానిగా ఉన్న షిగెరు ఇషిబా ఇటీవ‌ల రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్య‌లో అధికార లిబ‌ర‌ల్ డెమోక్ర‌టిక్ పార్టీ అధ్య‌క్షురాలిగా స‌నై త‌కైచి ఎన్నిక‌యింది.

గ‌త ఎన్నిక‌ల్లో పార్ల‌మెంటు ఎగువ స‌భ‌లో అధికార పార్టీ మెజారిటీని సాధించ‌లేక‌పోయింది. దిగువ స‌భ‌లో కూడా అధికార పార్టీ మెజారిటీ కోల్పోయింది. ఈ ఒత్తిడితో ఇషిబా త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ఈ క్ర‌మంలో పార్టీలో శ‌నివారం ఎన్నిక‌లు జ‌రుగ‌గా ముగ్గురు బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను ఓడించి త‌కైచి విజ‌యం సాధించింది. దీంతో జ‌పాన్‌కు తొలి ప్ర‌ధానిగా ఎన్నికై త‌కైచి రికార్డుల‌కెక్కింది.

Also Read: దేశ రాజ‌ధానిలో ప‌డిపోయిన గాలి నాణ్య‌త‌

Leave A Reply

Your email address will not be published.