‘సర్వోదయ సంకల్ప పాదయాత్ర’
భూదాన ఉద్యమానికి 75 సంవత్సరాలు పూర్తి
పోచంపల్లి (CLiC2NEWS): భూదాన ఉద్యమానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ‘వినోబా బావే’ శిష్యులు ‘సర్వోదయ సంకల్ప పాదయాత్ర’ కు శ్రీకారం చుట్టారు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి నుండి ‘రాజీవ్ గాంధీ పంచాయితీ రాజ్ సంఘటన్’ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. వినోబా బావే స్వగ్రామం అయిన మహారాష్ట్రలోని సేవాగ్రామ్ వరకు 600 కిలోమీటర్లు మేర ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో సిఎల్పి నేత భట్టి విక్రమార్క, టిపిసిసి ప్రచార కమిటి అధ్యక్షుడు మధుయాష్కి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.