ప్రతి ఏడాది జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవం: సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ (CLiC2NEWS): బాలికల విద్యకోసం విశేషమైన కృషి చేసిన సావిత్రి బాయి పులే జయంతిని రాష్ట్రప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏడాది జనవరి 3వ తేదీన సావిత్రిబాయి జయంతిని అధికారికంగా నిర్వహించాలని సూచించింది. లింగ వివక్ష,కుల అసమానతలపై సావిత్రి బాయి పులే పోరాటం చేశారని, ప్రతి ఒక్కరికీ అది స్ఫూర్తిదాయకమని, ఆమె ఆశయాలను సాధించేందుకు కాంగ్రెస్ సర్కార్ నిరంతరం కృషి చేస్తుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 50%పైగా మహిళా ఉపాధ్యాయులే ఉన్నారని.. వారికి ప్రధాన్యం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం మహిళా ఉపాధ్యాయులను సన్మానించాలని, పలు కార్యక్రమాలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఏడాది జనవరి 3న సావిత్రిబాయి పులే జన్మదినం సందర్బంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని సిఎం పిలుపునిచ్చారు.