SBI customers ALERT!: ఖాతాదారులకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్

న్యూఢిల్లీ (CLiC2NEWS): మోసగాళ్ళ బారిన పడొద్దని ఖాతాదారుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తన కస్టమర్లను అలర్ట్ చేసింది. మోసగాళ్ళు ఎలాగైనా మోసం చేయవచ్చని.. అందుకని జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ప్రస్తుత పరిస్థితులలో కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపింది. ఈ విషయాన్ని SBI కస్టమర్లకోసం ట్విట్టర్లో పోస్టు చేసింది. మోసగాళ్లు మెడిసిన్స్ పేరు చెప్పి డబ్బులు దొంగిలించే అవకాశముందని హెచ్చరించింది. అలాగే ప్రాణాలను కాపాడే ఔషదాల పేరుతో మోసాలు జరగొచ్చని తెలిపింది. మెడిసిన్స్ కు డబ్బులు చెల్లించడానికి ముందు అన్ని విషయాలను జాగ్రత్తగా తెలుసుకోవాలని SBI తన కస్టమర్లను కోరింది. స్టేట్ బ్యాంక్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
Please ensure to verify the authenticity of the beneficiary you are dealing with before making any payment. pic.twitter.com/ilFFyseglP
— State Bank of India (@TheOfficialSBI) April 23, 2021