పార్లమెంట్‌లోని రాజదండంపై ఎస్‌పి వ్యాఖ్యలు.. యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం

ఢిల్లీ (CLiC2NEWS): పార్లమెంట్ నూతన భవనంలో సభాపతి కుర్చీ పక్కన రాజదండాని ఏర్పాటు చేశారు. దీనిపై సమాజ్‌వాద్ పార్టి ఎంపి ఆర్‌కె చౌధరి రాచరికానికి ప్రతీక సెంగోల్‌ను ( రాజదండాన్ని) పార్లమెంట్‌లో పెట్టడాన్ని ప్రశ్నించారు. రాజదండాన్ని సభ నుండి తొలగించాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. దీనికి ఎస్‌పి అధినేత అఖిలేశ్ యాదవ్ మద్దతిచ్చారు. దీనిపై యోగి ఆదత్యనాథ్ స్పందించారు. సమాజ్‌వాది పార్టి మన దేశ చరిత్ర, తిమళ సంస్కృతిని అగౌరవపరిచిందని, ఇండియా కూటమికి భారతీయ చరిత్ర పట్ల ఏమాత్రం గౌరవం లేదని అన్నారు. ఆ వ్యాఖ్యలు ఖండిస్తున్నానన్నారు.
రాజదండం భారత్‌కు గర్వకారణం. ఈ విషయాన్ని వారు అర్ధం చేసుకోలేకపోతున్నారని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ వేదికగీ ఆరోపించారు.