Schizophrenia: పిచ్చి, ఉన్మాదం లక్షణాలు.. ఆయుర్వేద చికిత్స
పిచ్చి, ఉన్మాదం.. సమాజంలో ఎక్కడైనా ఏ వ్యక్తి అయినా కొంచెం కోపంతో దురుసుగా మాట్లాడటం జరిగితే లేక కొంత వింతగా ప్రవర్తిస్తే వీడు సైకో అని పిలుస్తుంటాం. నిజానికి సైకో సిస్ వ్యాధితో ఉండే లక్షణాలను ఇప్పుడు మనం కొంతవరకు తెలుసుకుందాం. వీరి ఆలోచనలు ప్రవర్తన నిజ పరిది నుండి దాటిపోయి ఉంటుంది. loss of touch with reality. అసహజమైన ప్రవర్తన ఇతరులను కారణం లేకుండా తిట్టుట, కొట్టుట, అనుమానించుట, ఒంటి మీద బట్టలు సరిగా ఉంచుకోకపోవడం తమలో తాము నవ్వుకోవటం అర్థం లేకుండా మాట్లాడటం రోడ్లమీద పరిగెత్తడం కారణం లేకుండా అటు ఇటు తిరగటము,గట్టిగా అరవటము,నవ్వటము పాటలు పాడటం, దూకటము ఇలాంటి మొదలైనవి అసహజమైన ప్రవర్తనలు చేస్తూ ఉంటారు.
వీరికి తమకు జబ్బు చేసిందని గ్రహించే శక్తి ఉండదు. లాస్ of insight towards illness. వీరికి వైద్యం చేయించుట కోసము డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్దాం అన్నా సహకరించరు. అర్థం కాకుండా అర్థం లేని మాటలు మాట్లాడుతుంటారు. తమకు తాము ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. మానసిక వ్యాధుల్లో పిచ్చి, ఉన్మాదం,(స్కిజో ప్రినియా) ఒకటి శరీరంలో ఎన్నో న్యూరో ట్రాన్స్ మీటర్స్ ఉన్నాయి. ఈ న్యూరో ట్రాన్స్ మీటర్ల అస్తవ్యస్తం వలన రోగాలకు కారణం అవుతాయి డోపమిన్ యొక్క మెటాబలిజంలో అస్తవ్యస్థ పరిస్థితి వల్ల ఏర్పడే జబ్బుల్లో ఉన్మాదం ఒకటి.
ఆయుర్వేద శాస్త్రజ్ఞుడైన చరక, సుశ్రుతుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఉన్మాదాన్ని తమ గ్రంధాల్లో పొందపరిచినారు. ఆచార్య చరకుడు ఉన్మాదాన్ని 5 రకాలుగా మరియు ఆచార్య సుశ్రుతుడు ప్రఖ్యాత సర్జన్ 6 రకాలుగా పేర్కొన్నారు. మెదడు రూపంలో విధుల్లో రసాయనక క్రియల్లో కలిగే ప్రత్యేకమైన మార్పులు ఈ వ్యాధి రావడానికి ప్రాథమిక కారణాలు. ఈ మార్పులు జన్యుపరమైన అంశాలను అనుసరించి సాగుతాయి. ఇలాంటి మార్పులు ఒక వ్యక్తుల సంభవించినప్పుడు ఆ జన్యుపరమైన అంశాలు కొన్నిసార్లు వ్యాధి లక్షణాలను కనిపించవచ్చు లేదా ఆస్పష్టంగా మిగిలిపోవచ్చును. అయితే కేవలం జన్యుపరమైన అంశాలు మాత్రమే ఈ వ్యాధికి ప్రధాన కారణం కానవసరం లేదు. ఈ వ్యాధి సోకటానికి ఏ ఒక్క జన్యు కారణమవుతుందని రుజువు కాలేదు. ఇటీవల పరిశోధనలు మెదడుకు చెందిన రసాయన పదార్థాలైన డోపమైన్ సెరొటోనిన్లు schizophrenia కు సంబంధించిన వివిధ లక్షణాలు కారణమని వెల్లడించాయి. శారీరక మానసిక సాంఘిక కారణాలు కాకుండా కుటుంబ పరిస్థితులు పరిసరాల ప్రభావం మొదలైనవి కూడా ఈ వ్యాధి రావడానికి దోహదపడతాయి .
దీని లక్షణాలు. మరియు గుర్తించటానికి కొన్ని ముఖ్యాంశాలు:
అభిరుచి లేకపోవటం, సమాజం నుంచి దూరంగా ఉండాలనుకోవడం, పనిలో గాని చదువులో గాని అభిరుచి లేకపోవటం. ఏకాగ్రత లేకపోవటం ,చిరాకు తన ప్రపంచం ఏదో తానేదో అన్నట్లు ఉంటుంటారు.
లక్ష్యం లేకుండా తిరగటం ఆలోచనలతో సతమతం అవటం ,శూన్యంలో చూడటం తమలో తాము నవ్వుకోటం, గొణగడం, రోడ్లమీద పరిగెత్తటం, ఒంటిమీద దుస్తులు పట్ల ధ్యాస లేకపోవడం, కొన్నిసార్లు సిగ్గు తెలియకపోవటం, రోజువారి విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోవటం ,ఉద్రేకపూర్వకంగా ప్రవర్తించటం, అకస్మాత్తుగా ఇతరులను తిట్టడం కొట్టడం వంటివి చేస్తుంటారు.
అసాధారణంగా ప్రవర్తించటం, వింతగా మాట్లాడటం ఒక మాటకు ఒక మాటకు పొంతన లేకుండ మాట్లాడటం, ఇతరులు తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతారనుకోవటం, స్నేహితులు బంధువులు తన శత్రువులుగా మారారని భావించటం, తన మనసులోని ఆలోచనలు ఎదుటి వారు చదువుతున్నారు అని భావించటం, తన ఆలోచనలను ఇతరులు నియంత్రిస్తున్నారు అనుకోవటం, ఆలోచనలను తాను నియంత్రించుకోగల అనుకోవటం విపరీతమైన అనుమానము, జీవిత భాగస్వామి తనపై చూపే ప్రేమ పట్ల అనుమానము, తనకు పెట్టే ఆహారంలో ఎవరో విషం కలుపుతున్నారు అనుకోవటం ,అపరిచితులు తన గురించి మాట్లాడుకుంటున్నారని భావించటం మొదలైనవి.
వీరికి చుట్టుపక్కల మనుషులు లేకపోయినా ఎవరో మాట్లాడినట్టు మాటలు వినిపిస్తాయి వీటిని ఆడిటరీ హాలు సినేషన్స్ అని పిలుస్తారు.
భయంకరమైన దృశ్యాలు చూస్తున్నట్లు లేని వింత, వాసనలు అనుభవిస్తున్నట్లు ప్రవర్తిస్తారు. ఇలాంటి అనుభవాలు దౌర్జన్యాలు నేరాలు చేసే లాగానో ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొలుపుతాయి.
వీరు వ్యక్తిగత శుభ్రత పాటించరు బావోద్రేకాలను వ్యక్తీకరించలేరు. ఏదైనా విషయాన్ని నిర్ణయించే శక్తి కోల్పోతారు. తమలో ఏదో లోపం ఉందనే విషయాన్ని అంగీకరించరు. ఈ పిచ్చి ఉన్మాదం వలన మంచి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. జీవితమంతా నిస్సారంగా లక్ష్యరహితంగా, ఏకాంతంగా,శారీరక శుభ్రత లేకుండా సాగుతుంది. వ్యక్తులతో సంబంధాలు దెబ్బతింటాయి. జీవితంలోని ఏ అంశము దీని ప్రభావం నుంచి తప్పించుకోలేదు. అది సమాజపరమైనదైన,వృత్తి పరమైన,కుటుంబ పరమైన, వివాహపరమైన, ఆర్థికపరమైన అంశాలైనా న్యాయ శుభ్రత,ప్రేమ, బాధ్యత చదువు విజ్ఞానం ఇలా ఏ అంశమైనా దీని ప్రభావానికి లోనవుతుంది. ముఖ్యంగా ఆర్థికంగానూ సాంఘిక పరంగా ను చూపే ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది.
మనసుకు బాధ కలగటం లేదా మనోబిఘతము చింత అధిక భయము విరుద్ధ ఆహారములు ఇతర కారణముల వల్ల వాతాధి దోషములు ప్రకోపించి అల్ప సత్వ గుణములు కలిగిన వాని యొక్క హృదయమును దూషింపజేసే మనోవాహ స్రోతస్సులను ఆశ్రయించి మానవుని యొక్క మనసును మోహితము చేసిన ఉన్మాదము కలుగును. మనోవాహ స్రోతస్సులు శరీరమంతట వ్యాపించి ఉంటాయి.
ఈ వ్యాధికి వున్నవారికి వెంటనే చికిత్స చేయించవలెను
ఆయుర్వేద చికిత్స
1. జటా మాంసి, వచ, సర్ప గంధ, బ్రహ్మీలను సమంగా కలిపి మూడు నుంచి నాలుగు గ్రాములు రోజుకు మూడుసార్లు తేనేతో కలిపి ఇవ్వాలి.లేదా
2. సర్పగంధ రోజుకి మూడు గ్రాములు రెండుసార్లు తేనెతో కలిపి ఇవ్వాలి లేదా
3. అశ్వగంధ చూర్ణము మూడు గ్రాములు పాలలో కలిపి సేవించాలి లేదా
4. హింగువాది గృతం లేదా కళ్యాణకఘృతం 30 మిల్లి రోజుకు మూడుసార్లు ఇవ్వాలి.
5. క్షీరబల తైలముతో దార చికిత్స చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దగ్గర ఉన్న ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదించి దీనికి వెంటనే చికిత్స చేయించుకోండి.
6. స్విమ్మింగ్ ,వాకింగ్,రన్నింగ్,మరియు యోగ చికిత్సలో ప్రాణాయామము, కపాల భాతి అనులోమా విలోమ, బ్రమరి, ఉజ్జయిని, ఉద్గీత్ చేయాలి. యోగాలో ని అక్కడ రోగి యొక్క పరిస్థితిని బట్టి యోగా గురువు కొన్ని ఆసనాలు చేయిస్తారు, మరియు ధ్యాన ముద్ర, శవాసనం కూడా బాగా పనిచేస్తుంది.