శ్రీకాకుళం జిల్లాలో చెరువులోకీ దూసుకెల్లిన స్కూల్ బస్సు
![](https://clic2news.com/wp-content/uploads/2025/02/School-bus-crashes-into-pond.jpg)
మందస (CLiC2NEWS): శ్రీకాకుళం జిల్లాలో ఓ పాఠశాల బస్సు అదుపు తప్పి చెరువులోకీ దూసుకెళ్లింది. ఈ ఘటన మందసం మండలం ఉమాగిరి వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థలుకు గాయాలయ్యాయి. వివేకానంద పాఠశాల బస్సు శనివారం సాయంత్రం స్కూల్ నుండి విద్యార్థులను తీసుకెళుతుండగా రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకీ దూసుకెళ్లింది. గమనించిన స్థానికులు బస్సులో చిక్కుకున్న విద్యార్థులను ఒడ్డుకు తీసుకువచ్చారు. గాయాలైన విద్యార్థులను సమీప ఆస్పత్రికి తరలించారు.