ఈ నెల 20న సికింద్రాబాద్ జగన్నాథ రథయాత్ర
![](https://clic2news.com/wp-content/uploads/2023/06/jagannatha-rathayatra.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): జూన్ 20వ తేదీన సికింద్రాబాద్‌లో జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని జగన్నాథ ఆలయంలో ఈ రథయాత్ర 130 ఏళ్ల నుండి నిర్వహిస్తున్నారు. జగన్నాథుడు భలభద్రుడు , సుభద్రల విగ్రహాలను ఊరేగించనున్నట్లు శ్రీ జగన్నాథ స్వామి రామ్‌గోపాల్ ట్రస్ట్ ప్రకటించింది.
రథయాత్ర సందర్భంగా స్వామి వారి దర్శనానికి భక్తులను 20వ తేదీన ఒంటి గంట వరకే అనుమతించనున్నారు. కావును భక్తులు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు స్వామివారిని దర్శించుకోగలరని ఆలయ నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం 4 గంటల నుండి రథయాత్ర ప్రారంభం అవుతుంది.
[…] ఈ నెల 20న సికింద్రాబాద్ జగన్నాథ రథ… […]