పాస్‌పోర్టుల జారీలో ఐదోస్థానంలో సికింద్రాబాద్..

హైదరాబాద్ (CLiC2NEWS): పాస్‌పోర్టుల జారీలో సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయం దేశంలో నిలిచింది. దేశంలో ఉన్న 37 ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాల్లో మొదటి నాలుగు స్థానాల్లో ముంబయి, బెంగళూరు. లఖ్‌నవూ, చండీగఢ్ ఉండగా.. ఐదో స్థానంలో సికింద్రాబాద్ నిలిచిందని పాస్‌పోర్టు అధికారి (ఆర్పిఒ) జొన్నలగడ్డ స్నేహజ తెలిపారు. పాస్‌పోర్టుల కోసం దళారీలను ఆశ్రయించవద్దని ఆమె ఈ సందర్బంగా విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాదిలో మొత్తం 7,85,485 పాస్‌పోర్టులు జారీ చేసినట్లు తెలిపారు.