గుంటూరు బైపాస్ సమీపంలో నిలిచిపోయిన సికింద్రాబాద్-రేపల్లె ఎక్స్‌ప్రెస్

గుంటూరు (CLiC2NEWS): సికింద్రాబాద్-రేపల్లె ఎక్స్‌ప్రెస్ రైలు సాంకేతిక లోపంతో గుంటూరు బైపాస్ దాటిన తర్వాత నిలిచిపోయింది. రైలు నుండి పెద్ద శబ్దం రావడం.. నిప్పురవ్వలు ఎగసిపడటంతో ప్రయాణికులు చైన్‌లాగి రైలును నిలిపివేశారు. దాదాపు 2 గంటలుగా రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రైలు రేపల్లె స్టేషన్‌లో రాత్రి 10 గంటలకు రేపల్లె నుండి సికింద్రాబాద్‌కు బయల్దేరాల్సి ఉంది.