సికింద్రాబాద్ టు వైజాగ్ మరో వందేభారత్..

హైదరాబాద్ (CLiC2NEWS): సికింద్రాబాద్ నుండి విశాఖకు మరో వండేభారత్ రైలు నడవనుంది. ఈ నెల 12వ తేదీన రైలు (నం. 20707/20708) ప్రారంభం కానుంది. ఈ సికింద్రాబాద్ నుండి ప్రముఖ నగరాలను కలుపుతూ వైజాగ్ చేరుకుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభించనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో తెలిపింది. గురవారం మినహా మిగతీ రోజుల్లో ఈ రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. రెగ్యులర్ సర్వీసులు మార్చి 13 నుండి .. బుకింగ్లు మార్చి 12 నుండి అందుబాటులో ఉండనున్నాయి.