గుండెపోటుతో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి భద్రతా చెక్..
రామగుండం పోలీస్ కమిషనరేట్ (CLiC2NEWS): గుండెపోటుతో ఇటీవల మరణించిన గోదావరిఖని వన్‌టౌన్ కానిస్టేబుల్ కుటుంబానికి సిపి శ్రీనివాస్ భద్రతా చెక్ అందించారు. గోదావరిఖని వన్‌టౌన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ పి ప్రవీణ్ మృతి చెందారు. కమిషనర్ కార్యాలయంలో ఆ కుటుంబానికి భద్రత ఎక్స్‌గ్రేషియా రూ. 5,49,000 చెక్‌ను అందించారు. ఈ సందర్బంగా కానిస్టేబుల్ కుటుంబ ప్రస్తుత పరిస్తితతులు గురించి అడిగితెలుసుకున్నారు. వారి కుటుంబానికి పోలీసుశాఖ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.