తెలంగాణ నూత‌న సిఎస్‌గా సీనియ‌ర్ ఐఎఎస్ అధికారి రామ‌కృష్ణారావు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్ర నూత‌న ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కె. రామ‌కృష్ణారావును నియ‌మించింది. ఈయ‌న ప్ర‌స్తుతం ఆర్ధిక శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. ప్ర‌స్తుత సిఎస్ శాంతి కుమారి ఏప్రిల్ 30న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో సీనియ‌ర్ ఐఎఎస్ అధికారి రామ‌కృష్ణారావు సిఎస్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఈయ‌న 2014 నుండి ఆర్ధిక శాఖ బాధ్య‌త‌ల‌ను నిర్వర్తిస్తున్నారు. మ‌రోవైపు రాష్ట్రంలో భారీగా ఐఎఎస్ అధికారుల‌ను ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.