విజ‌య‌న‌గ‌రంలో  పేలుళ్ల కుట్ర కేసు.. విచారణ‌లో ప‌లు కీల‌క విష‌యాలు

విజ‌య‌నగరం (CLiC2NEWS): విజ‌య‌నగరం పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్‌, స‌మీర్ ల‌ను రిమాండ్‌కు త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే. నిందితుల‌ను విచార‌ణ వ‌రుస‌గా మూడు రోజులు జ‌రిగింది. సిరాజ్ , స‌మీర్ వాంగ్మూలాన్ని ఢిల్లీ ఎన్ ఐఎ అధికారులు న‌మోదు చేశారు. పేలుళ్ల కోసం సిరాజ్ , స‌మీర్ హైద‌రాబాద్, విజ‌య‌న‌గ‌రం, ఢిల్లీ , బెంగ‌ళూరు, ముంబ‌యిలో రెక్కీ నిర్వ‌హించిన‌ట్లు స‌మాచారం. విశాఖ‌కు చెందిన రిటైర్డ్ రెవెన్యూ అధికారి పాత్ర‌పై అధికారులు ఆరా తీశారు. తెలంగాణ‌, ఎపి , కర్ణాట‌క‌, మ‌హారాష్ట్రకు చెందిన 12 మంది గ్రూప్‌గా ఉన్న‌ట్లు గుర్తించారు. సౌదీ హ్యాండ‌ర్ల నుండి అందిన నిధుల‌పై కూడా ఎన్ ఐఎ అధికారులు కూపీ లాగుతున్నారు. నిందితుల సోష‌ల్ మీడియా కాతాలు, అమీమ్ సంస్థ మూలాలు,విదేశీ కాల్స్‌పై ఆరా తీశారు.

స‌మీర్‌, సిరాజ్ ఆల్ హింద్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (అహిం) సంస్థ‌ను స్థాపించి .. ఆ సంస్థ‌లోకి మ‌రికొంద‌రిని చేర్చుకొని వారంద‌రికీ ఇన్‌స్టా గ్రూప్ క్రియేట్ చేసుకొని పేలుడు ప‌దార్థాల‌ను త‌యారు చేస్తున్నారు. వీరిలో కొంత‌మంది బాంబులు త‌యారు చేయ‌డం.. మిగ‌తా వారు బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించ‌డమ‌నేది వీరి ప‌ని. వీరికి సౌదీ నుండి ఆదేశాలు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. వీరంతా హైద‌రాబాద్‌లో కొన్ని రోజులు ఉన్నారు. అనంత‌రం బాంబు రిహాల్స‌స్ కోసం విజ‌య‌న‌గ‌రం వెళ్లిన సిరాజ్‌ను పోలీసులు అదుపులోకీ తీసుకొన్నారు.

యూట్యూబ్ చూసి అగ్గిపుల్ల‌ల మందుతో బాంబు త‌యారీ..

 

Leave A Reply

Your email address will not be published.