విశాఖలో నాటు తుపాకీతో కాల్పులు
విశాఖపట్టణం (CLiC2NEWS): విశాఖలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటన చికలపేట ప్రధాన ద్వారం వద్ద చోటుచేసుకుంది. చేపల రాజేశ్ అనే వ్యక్తిపై నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని సస్పెన్షన్లో ఉన్న కానిస్టేబుల్‌గా గుర్తించారు. పాత కక్షల నేపథ్యంలో కాల్పులు జరిపి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Cinema news: న్యూయార్క్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక