డ్ర‌గ్స్ అమ్మేందుకు య‌త్నించిన ఎస్ఐ రాజేంద‌ర్ అరెస్ట్‌

 హైద‌రాబాద్‌ (CLiC2NEWS): సైబ‌ర్ క్రైమ్ విభాగంలో సిసిఎస్ ఎస్ ఐగా ప‌నిచేస్తున్న రాజేంద‌ర్ చేతివాటం ప్ర‌ద‌ర్శించాడు. నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న డ్ర‌గ్స్ లో సుమారు 1,750 గ్రాముల వ‌ర‌కు త‌న వ‌ద్ద‌నే ఉంచి.. దానిని అమ్మేందుకు ప్ర‌య‌త్నించ‌గా నార్కొటిక్ అధికారులు రాజేంద‌ర్‌ను వ‌ల‌ప‌న్ని ప‌ట్టుకున్నారు. ప‌క్కా స‌మాచారం అంద‌డంతో త‌న ఇంట్లోనే రాజేంద‌ర్‌ను అరెస్టు చేశారు. నిందితుడిని రాయ‌దుర్గం పోలీసులు రిమాండ్‌కు త‌ర‌లించారు. గ‌తంలోనూ రాజేంద‌ర్‌పై అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్న‌ట్లు స‌మాచారం. రాయ‌దుర్గం ఎస్ ఐగా విధులు నిర్వ‌హిస్తుండ‌గా ఎసిబికి రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డారు. దీనికి గాను అత‌డిని సర్వీస్ నుండి తొల‌గిస్తూ ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి. ఈ ఉత్త‌ర్వులపై రాజేంద‌ర్ కోర్డునుండి స్టే తెచ్చుకున్నాడు. అనంత‌రం సైబ‌రాబాద్ సిసిఎస్ విభాగంలో ఎస్ ఐగా విధులు నిర్వ‌హిస్తున్నాడు.

Leave A Reply

Your email address will not be published.