అవినీతి ఆరోప‌ణ‌ల‌తో ఎస్ఐ స‌స్పెండ్‌..

రామగుండం పోలీస్ కమీషనరేట్ (CLiC2NEWS): అవినీతి ఆరోపణలపై ఎస్ఐను సస్పెండ్ చేస్తూ ఐజిపి ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ అప్పస్ సోనియా ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐ జి పి ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ SHO గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ కేసు విషయంలో అవినీతి వ్యవహారం పై ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడం జరిగిందని ఐజిపి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.