ప్రకాశం జిల్లాలో లారీని ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి

ఒంగోలు (CLiC2NEWS): ప్రకాశం జిల్లాలో లారీ, కారు ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మహానంది నుండి తిరిగి వెళుతున్న ప్రయాణికుల కారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద లారీని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో 8 మంది ఉన్నారు. వీరిలో ఆరుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు . వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. వీరంతా బాపట్ల జిల్లా స్టువర్టుపురం వాసులుగా పోలీసులు గుర్తించారు.