రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..!
![](https://clic2news.com/wp-content/uploads/2023/04/RAJADHANI-EXPRESS.jpg)
కావలి (CLiC2NEWS): రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. ఎపిలోని కావలి వద్ద ఆదివారం ట్రైన్ చక్రాల నుండి పొగలు రావడంతో లోకో పైలట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే రైలును కావలి స్టేషన్‌లో నిలిపివేశారు. రాజధాని ఎక్స్ ప్రెస్ .. నిజాముద్దీన్ నుండి చైన్నైకు వెళ్తున్న ట్రైన్ ఆదివారం ఉదయం కావలి స్టేషన్‌కు రాగానే బి-5 బోగీ వద్ద చక్రాల నుండి పొగలు వచ్చాయి. దీనిని గమనించిన లోకోపైలట్ అప్రమత్తమై ట్రైన్ నిలిపివేశాడు. స్వల్ప మరమ్మతులు చేసిన అనంతరం ట్రైన్ బయలుదేరింది.