విజయనగరంలోని అలమండ వద్ద రైలులో పొగలు..
పుదుచ్చేరి-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌లో వ్యాపించిన పొగలు
విజయనగం (CLiC2NEWS): జిల్లాలోని అలమండ వద్ద భీమిసింగి వంతెన పై వెళుతున్న రైలులో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఇది గమనించిన పొలాలలో ఉన్న పశువుల కాపరి.. రైలులోని ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. దీంతో ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలును ఆపారు. పుదుచ్చేరి నుండి హావ్‌డా వెళుతున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ఫ్రెస్‌లోని ఎసి బోగీలో పొగలు వచ్చాయి. రైలు ఆగిన తర్వాత రైల్వేగార్డు పరిశీలించి బ్రేక్ బైండింగ్.. బ్రేక్ వేసినపుడు వేడి పెరిగి పొగలు వ్యాపించినట్లు గుర్తించాడు. ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాత రైలు బయలుదేరింది.