ల్యాప్ ట్యాప్ పేలుడు ఘ‌ట‌న‌.. తీవ్ర‌గాయాలైన సాప్ట్‌వేర్ ఇంజ‌నీర్ మృతి

బి.కోడూరు (CLiC2NEWS): వైఎస్సార్ క‌డ‌ప జిల్లా బి. కోడూరు మండ‌లంలో ల్యాప్‌టాప్ పేలి సాప్ట్‌వేర్ ఇంజ‌నీర్ సుమ‌ల‌త‌కు తీవ్ర గాయాలైన విష‌యం తెలిసిన‌దే. ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స‌ను అందిస్తున్నారు. చికిత్స పొందుతూ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. వ‌ర్క్‌ఫ్రం హోంలో భాగాంగా ల్యాప్‌టాప్ పై వ‌ర్క్ చేస్తున్న స‌మ‌యంలో షార్ట్ స‌ర్క్యూట్ కావ‌డంతో ల్యాప్‌టాప్‌లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో బెడ్‌పైన కూర్చుని వ‌ర్క్ చేస్తున్న యువ‌తి విద్యుత్ షాక్ గురై అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోయింది.
అప్ప‌టికే తీవ్ర‌గాయాలైన ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దాదాపు 80శాతం కాలిన గాయాల‌వ్వ‌డంతో యువ‌తి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

ల్యాప్‌టాప్ పేలి.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు తీవ్ర గాయాలు

 

Leave A Reply

Your email address will not be published.