కంటైన‌ర్ పోర్టును పోనివ్వ‌బోమన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి

నెల్లూరు (CLiC2NEWS): కృష్ణ‌ప‌ట్నం నుండి కంటైన‌ర్ పోర్టును త‌ర‌లిపోనివ్వ‌బోమ‌ని తెలుగుదేశం పార్టి స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి అన్నారు. టెర్మిన‌ల్ ప‌నులు ఆగిపోతే ఎగుమ‌తులు, దిగుమ‌తులు నిలిచిపోతాయ‌ని.. కంటైన‌ర్ పోర్టు త‌ర‌లింపు వ‌ల‌న పోర్టుపై ఆధార‌ప‌డ్డ దాదాపు ప‌దివేల మంది ఉపాధి కోల్పోతార‌న్నారు. దీని కోసం కేంద్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేస్తామ‌ని ఆయ‌న అన్నారు. రైతులు, ఉద్యోగుల కోసం అవ‌స‌ర‌మైతే ఆదానీ కాళ్లు ప‌ట్టుకుంటాన‌ని ఆయ‌న అన్నారు.

కృష్ణ ప‌ట్నం పోర్టు కంటైన‌ర్ టెర్మిన‌ల్ కార్య‌క‌లాపాల‌ను య‌థావిధిగా కొన‌సాగించాలంటూ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న నేప‌థ్యంలో ఎమ్మెల్యే ఆధ్వ‌ర్యంలో ఆ ప్రాంతాన్ని అఖిల‌ప‌క్షం నేత‌లు శుక్ర‌వారం ప‌రిశీలించారు. కంటైన‌ర్ పోర్టును పున‌రుద్ధ‌రించాల‌ని కోరుతూ పోర్టు సిఇఒకు నేత‌లు విన‌తి ప‌త్రం అంద‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.