రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌గా సోనూ భరత్ కుమార్

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌గా సోనూ భరత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా లాలాపేటలోని విజయ డెయిరీ కార్యాలయంలో భరత్‌ను మంత్రి సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జహీరాబాద్ ఎంపి బిబిపాటిల్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి తదితరులు పాల్గొన్నారు.