రైల్వే ప్రయాణికులకు శుభవార్త..
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/Rs.2050-MEALS-IN-RAILWAY-STATIONS.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే అధికారులు తక్కువ ధరలకే భోజనం అందించనుంది. ఆహారాన్ని కేవలం రూ.20 ఎకానమి భోజనం, రూ. 50కే కాంబో భోజనం ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి తోడుగా ప్యాక్ చేసిన వాటర్ బాటిల్‌ను కూడా ఇస్తుంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం సర్వీస్ ఐఆర్‌సిటిసి సహకారంతో తక్కువ ధరకే ఆహారం రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రైల్వే అధికారలు వెల్లడించారు. మొదటగా హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, రేణిగుంట స్టేషన్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. తర్వాత ప్రయాణికుల నుండి వచ్చే స్పందనను అనుసరించి మిగతా స్లేషన్లలో కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.