600 మంది విద్యార్థుల‌తో శ్రీ‌రామ ఆకృతి..

క‌రీంన‌గ‌ర్‌ (CLiC2NEWS): క‌రీంన‌గ‌ర్‌లోని ఓ ప్రైవేటు పాఠ‌శాల‌లోని విద్యార్థులు శ్రీ‌రామ ఆకృతి ప్ర‌ద‌ర్శించి ఆక‌ట్టుకున్నారు. అయోధ్య రామ‌మందిరం ప్రారంభోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని 600 మంది విద్యార్థులు శ్రీ‌రామ మందిరానికి సంకేతంగా శ్రీ‌రామ ఆకృతి ప్ర‌ద‌ర్శించారు. జాతీయ జెండాల‌తో రామ బాణాన్ని ప్ర‌ద‌ర్శించి అంద‌రి దృష్టిని అబ్బుర‌ప‌రిచారు.

అయోధ్య రామ‌మందిర ప్రాణ‌ప్ర‌తిష్ట సంద‌ర్బంగా భ‌క్తులు అనేక మంది త‌మదైన శైలిలో స్పందిస్తున్నారు. కొంత మంది అయోధ్యకు సైక్లింగ్, స్కేటింగ్ చేస్తూ వెళుతున్నారు. ఓ ముస్లిం మ‌హిళ ఏకంగా 20 అడుగుల ప్లూట్‌న్ అయోధ్య‌కు స‌మ‌ర్పించిన‌ట్లు స‌మాచారం. మ‌రో భ‌క్తుడు బియ్యం గింజ‌లతో రామ‌మందిర నిర్మాణాన్ని అలంక‌రించి త‌న భ‌క్తిని చాటుకున్నాడు.

Leave A Reply

Your email address will not be published.