నగరంలో శ్రీరాముడి శోభాయాత్ర..

హైదరాబాద్ (CLiC2NEWS): శ్రీరామ నవమి సందర్బంగా హైదరాబాద్ నగరంలో శ్రీరాముడి శోభాయాత్ర కొనసాగుతోంది. దూల్‌పేటలో ఈ యాత్ర ప్రారంభమై కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు మొత్తం 6.2 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. జై శ్రీరామ్ నామస్మరణతో నగర వీధులు మార్మోగుతున్నాయి. ఈ యాత్రలో కేవలం నగర ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శోభాయాత్ర దృష్ట్యా నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మొత్తం 20 వేల మంది పోలీసులతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.