రేపు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో రాష్ట్ర మంత్రుల భేటీ
![](https://clic2news.com/wp-content/uploads/2022/03/piyush-goyal.jpg)
హైదరాబాద్ ( CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో కేంద్ర పౌరసరఫరాలు, ఆహార మంత్రిత్వశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసేందుకు రాష్ట్ర మంత్రులు నిన్న ఢిల్లీకి వెళ్లారు. నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్ర మంత్రులకు పీయూష్ గోయల్ గురువారం ఉదయం 11.40 గంటలకు సమయం కేటాయించనున్నారు. రేపు పార్లమెంట్ ఛాంబర్‌లో తెరాస మంత్రులు, ఎంపీలు గోయల్‌తో సమావేశం కానున్నారు.