ఉపాధ్యాయుల ఆకాంక్షలను నెరవేరుస్తాం.. హరీశ్‌రావు
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/STATE-TEACHERS-UNION-FO-TS.jpg)
ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సానుకూలంగా ఉన్నట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (STUTS) వజ్రోత్సవాలలో రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 75 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సంఘం ఎస్‌టియుటిఎస్ అని.. టీచర్ల సమస్యలు పరిష్కిరించటంలో ఈ సంఘం విశేషంగా కృషి చేస్తుందన్నారు. అనంతరం ఎస్‌టియుటిఎస్ ప్రత్యేక సంచికను, కొత్త సంవత్సరం డైరీ, నూతన కాలెండర్‌ను ఆవిష్కరించారు.