ప్లాస్టిక్ వినియోగానికి చెక్ పెట్టే దిశగా.. స్టీల్ బ్యాంకు
హైదారాబాద్ (CLiC2NEWS): పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా పంచాయితీరాజ్ శాఖ ఓ వినూత్నమైన కార్యక్రమానికి తీసుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయితీలో స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్లాస్టిక్ వాడకం బదులు స్టీల్ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్లాస్టిక్ వినియోగానికి చెక్ పెట్టనున్నారు. ఈ స్టీల్ బ్యాంక్ ప్రతి ఊరిలో అందుబాటులోకి
రానుంది. దేశ వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించిన విషయం తెలిసిందే.
సిద్దిపేట జిల్లాలోని మొత్తం పంచాయితీలు ఈ స్టీల్ బ్యాంకును ఏర్పాటు చేసి.. అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. జిల్లాలోని మొత్తం 23 మండలాల్లోని 499 పంచాయితీల్లో ఏర్పాటు చేశారు. స్టీల్ బ్యాంకు నిర్ణయం.. దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ప్రస్తుతం దాదాపు రాష్ట్రంలోని 170 మండలాల్లోని గ్రామ పంచాయితీ కార్యాలయాల్లో ఈ స్టీల్ బ్యాకంకును ఏర్పాటు చేశారు.