సమస్యాత్మక ప్రాంతాలలో పటిష్టమైన భద్రత..
రామగుండం పోలీస్ కమిషనరేట్ (CLiC2NEWS): రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని జైపూర్ ఎసిపి మోహన్ అన్నారు. చెన్నూర్ రూరల్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో కోటపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
మాట్లాడారు. ఈ కార్యక్రమానికి జైపూర్ ఎసిపి మోహన్ ముఖ్య అతిథిగా హాజరై భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని తెలిపారు. ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రజలు తమ ఓటు వేయాలన్నారు. పోలింగ్ రోజున సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కవాతులో చెన్నూర్ రూరల్ సీఐ విద్యా సాగర్, చెన్నూర్ టైన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, కోటపల్లి ఎస్ఐ సురేష్, నీల్వాయి ఎస్ఐ సుబ్బారావు, భీమారం ఎస్ఐ రాజవర్ధన్, TSSP సిబ్బంది, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.