బాసర ఆర్జెయుకెటి విద్యార్థి ఆత్మహత్య!
![](https://clic2news.com/wp-content/uploads/2021/01/dead-body.jpg)
బాసర (CLiC2NEWS): ఆర్జెయుకెటి వర్సిటీలో పియుసి -1 చదువుతున్న విద్యార్థి మంగళవారం ఆత్యహత్యకు పాల్పడ్డాడు. బాయ్స్ హాస్టల్లో ఉరి వేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. వర్సిటీ సిబ్బంది అతనిని నిర్మల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి వ్యక్తిగత కారణాల వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. విద్యార్థిది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్. విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలిపారు.