కిటకిటలాడుతున్న శంషాబాద్ ఎయిర్‌పోర్టు
ఉన్నత చదువుల కోసం విద్యార్థులు విదేశాలకు ..
హైదరాబాద్ (CLiC2NEWS): శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థులతో గత కొన్ని రోజులుగా ఎయిర్‌పోర్డు కిటకిటలాడుతోంది. రోజుకి 50 వేల మంది డొమెస్టిక్, 10 వేల మంది ఇన్‌టర్నేషనల్ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో విద్యార్థులు సుమారు 5వేల వరకు ఉంటున్నాట్లు సమాచారం. ఉన్నత చదువుల కోసం యువత ముఖ్యం గా ఆమెరికా, కెనడాకు అధిక సంఖ్యలో వెళ్తున్నారు. ఈ రెండు దేశాల్లో ఆగస్టు, సెప్టెంబర్ నెలలో విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది. దీంతో గత రెండు వారాలుగా ఎయిర్‌పోర్టు రద్దీగా మారింది. రోజుకు 70వేలకు పైగా కార్లు.. లక్ష నుండి లక్షన్నర వరకు ప్రయాణికులు వస్తున్నారు. దీంతో విమానాశ్రయానికి వచ్చే వాహనాతో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యులు కూడా తలెత్తుతున్నట్లు అధికారులు తెలిపారు.